ఘనంగా తెలంగాణ సాయుధపోరాట వారోత్సవాలు

సీపీఐ జెండాను ఆవిష్​కరించిన కార్యదర్శి రామడుగు

Sep 15, 2024 - 18:30
 0
ఘనంగా తెలంగాణ సాయుధపోరాట వారోత్సవాలు

నా తెలంగాణ, రామకృష్ణాపూర్: కోల్ బెల్ట్ ఏరియా రామకృష్ణాపూర్ సీపీఐ పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం పార్టీ శ్రేణులు ఘనంగా తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాలను జరుపుకున్నారు. పట్టణంలోని పార్టీ కార్యాలయంలో సీపీఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్ జెండాను ఆవిష్కరించారు. రామడుగు లక్ష్మణ్, పట్టణ కార్యదర్శి మిట్టపెల్లి శ్రీనివాస్ లుపార్టీ శ్రేణులతో కలిసి ర్యాలీగా బయలుదేరి రామలయం, సూపర్ బజార్ మీదుగా బి జోన్ సెంటర్, రాజీవ్ చౌక్,రైల్వే స్టేషన్, ఆర్కేవాన్ మొదలైన ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన అమరవీరుల స్తూపల వద్ద పార్టీ జెండాలను ఎగురవేశారు. అనంతరం వారు అమరవీరుల త్యాగాలను స్మరించుకున్నారు.

ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా సమితి సభ్యులు మిట్ట పెల్లి పౌల్, నక్క వెంకట స్వామి, పెరిక సంపత్, అన్నం శ్రీనివాస్, మల్లేష్, మామిడి గోపీ, మొండి, ఎడ్ల గంగారాం, షేకీర్, ఇరవేని రవీందర్, రాంపెల్లి రాజన్న, శఠగోపం కిష్టయ్య, సురిమిల్ల వినయ్, కరూకురి రాయలింగు తదితరులు పాల్గొన్నారు.