హెచ్​ఏఎల్​ కు రూ. 65వేల కోట్ల ఆర్డర్​

స్వదేశీయంగానే రూపొందనున్న యుద్ధ విమానాలు దేశీయ రంగానికి ప్రోత్సాహమే లక్ష్యంగా రక్షణ రంగ శాఖ నిర్ణయం

Apr 12, 2024 - 14:36
 0
హెచ్​ఏఎల్​ కు రూ. 65వేల కోట్ల ఆర్డర్​

న్యూఢిల్లీ: రక్షణ రంగంలో భారత్​ మరో కీలక ముందడుగు వేసింది. హెచ్​ ఏఎల్​ (హిందుస్థాన్​ ఏరోనాటిక్స్​ లిమిటెడ్​–ప్రభుత్వ రంగ సంస్థ)కు రూ. 65వేల కోట్ల విలువైన విమానాల కొనుగోలు శుక్రవారం టెండర్​ ద్వారా ఆర్డర్​ ను జారీ చేసింది. దేశంలో అతిపెద్ద ఆర్డర్​ కూడా ఇదే కావడం విశేషం. 

దీని కింద 97 విమానాలు దేశీయంగానే భారత్​ కు అందనున్నాయి. మిగ్​–21, మిగ్​–23, మిగ్​–27 లాంటి యుద్ధ విమానాలకు ప్రత్యామ్నాయంగా భారత్​ లో తయారైన స్వదేశీ విమానాలు అందుబాటులోకి రానున్నాయి. వైమానిక దళం నుంచి పెద్ద యెత్తున ఈ తరహా విమానాల కాలపరిమితి ముగియనుండడంతో వీటి స్థానంలో కొత్తవాటి కొనుగోలుకు రక్షణ శాఖ ఆమోద ముద్ర వేసింది. 

ప్రధాని మోదీ పేర్కొంటున్న దేశీయ పరిశ్రమ రంగానికి ఊతమిచ్చే చర్యల్లో భాగంగా స్వదేశీ ప్రభుత్వ రంగ సంస్థ హెచ్​ఏఎల్​ కు ఆర్డర్​ ను ఇవ్వాలని కేబినెట్​ నిర్ణయించింది. ఒకవేళ ఈ సంస్థ గనుక ఆర్డర్​ ను కాదంటే అప్పుడు టెండర్​ ప్రక్రియ ద్వారా ముందుకు వెళ్లనున్నారు. ఇందుకు కనీసం మూడు నెలల సమయం పట్టనుంది.