నీతి ఆయోగ్ జల్ ఉత్సవ్ నీటి సంరక్షణే లక్ష్యం
Niti Aayog's Jal Utsav aims to conserve water

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: నీటి నిర్వహణ, సంరక్షణపై అవగాహన కల్పించేందుకు నీతి ఆయోగ్ నేతృత్వంలో 15 రోజులపాటు నిర్వహించే ‘జల్ ఉత్సవ్’ కార్యక్రమాన్ని బుధవారం ప్రారంభించింది. ప్రధాని నరేంద్ర మోదీ ఆలోచనా విధానం ద్వారా ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. జల్ ఉత్పవ్ నవంబర్ 24 వరకు కొనసాగనుంది. ఈ కార్యక్రమం ద్వారా ఎంచుకున్న కొన్ని ప్రాంతాల్లో నీటి నిర్వహణ, సంరక్షణ వంటి వాటిపై ప్రజలకు, పాఠశాల విద్యార్థులకు అవగాహన కల్పించనున్నారు. ఈ కార్యక్రమాల్లో స్థానిక నాయకులు కూడా పాల్గొననున్నారు.