ఆర్జీకర్​ వైద్యుల నిరవధిక నిరాహార దీక్ష

సమస్యల పరిష్కారంలో సర్కార్​ విఫలం

Oct 6, 2024 - 15:58
 0
ఆర్జీకర్​ వైద్యుల నిరవధిక నిరాహార దీక్ష

కోల్​ కతా: ఆర్జీకర్​ వైద్యులు డిమాండ్ల సాధనకు ఆదివారం నిరవధిక నిరాహార దీక్షకు దిగారు. ప్రభుత్వం తమ డిమాండ్లను నెరవేర్చడంలో విఫలమైందని, హామీలను పక్కన పెట్టిందని ఆరోపించారు. మెడికో హత్య అనంతరం కూడా పలు ఆసుపత్రులలో వైద్యులపై జరుగుతున్న దాడులపై ఆందోళన వ్యక్తం చేశారు. పశ్చిమ బెంగాల్​ ప్రభుత్వం తమ డిమాండ్లపై మీన మేషాలు లెక్కిస్తోందని ఆరోపించారు. తమ అధికారం కాపాడుకునేందుకు తమతో చర్చలు కొనసాగించి తూతూమంత్రంగా చర్యలు చేపట్టిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆసుపత్రుల్లో ఇంతవరకూ మెరుగైన సౌకర్యాలను కల్పించలేదని విమర్శించారు. తాము చేస్తున్న ఆందోళనకు ప్రభుత్వం కనీసం పశ్చాత్తాపం కూడా లేదన్నారు. కోర్టులో డిమాండ్లపై సానుకూల ధృక్పథంతో వ్యవహరిస్తూ పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం తిరిగి షరా మామూలే అన్నట్లు ప్రవర్తించడం మమత సర్కార్​ కే చెల్లిందని మండిపడ్డారు.