విద్యార్థికి కత్తిపోట్లు.. నిందితుడి ఇంటిపై బుల్‌డోజర్
ఇంటర్నెట్ నిలిపివేత కొనసాగుతున్న 144 సెక్షన్ జిల్లా వ్యాప్తంగా భారీ ఎత్తున బలగాల మోహరింపు
జైపూర్: ఉదయ్ పూర్ విద్యార్థి కత్తిపోటు ఘటనలో ప్రభుత్వం యాక్షన్ కు దిగింది. నిందితుడి ఇంటిని బుల్‌డోజర్ తో శనివారం కూల్చివేసింది. ఖంజీపీర్ లోని దివాన్ షా కాలనీలో నిందితుడి ఇళ్లు అక్రమంగా నిర్మించిందని అందుకే కూల్చివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. భారీ సంఖ్యలో పోలీసులు, భద్రతా దళాల నడుమ చర్యలకు ఉపక్రమించింది. మరోవైపు గాయపడ్డ విద్యార్థి పరిస్థితి ఇంకా విషమంగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. జిల్లాలో 144 సెక్షన్ కొనసాగుతోంది. శనివారం కూడా జిల్లా వ్యాప్తంగా చాలా దుకాణాలు తెరుచుకోలేదు.
ఆసుపత్రి, కళాశాల వద్ద భారీ సంఖ్యలో హిందుసంఘాలు నిరసనలు, ఆందోళనలు చేపడుతుండడంతో భారీ యెత్తున భద్రతా బలగాలను మోహరించారు. ముందుజాగ్రత్త చర్యగా ఆ ప్రాంతంలో ఇంటర్నెట్ ను పూర్తిగా నిలిపివేశారు.