గంజాయి పట్టివేత నలుగురిపై కేసు నమోదు
A case has been registered against four people for smuggling ganja
నా తెలంగాణ, రామకృష్ణాపూర్: రామకృష్ణాపూర్ పట్టణంలో గంజాయి విక్రయిస్తున్న నలుగురిపై పట్టణ పోలీసులు కేసు నమోదు చేసినట్లు బెల్లంపల్లి ఏసీపీ రవి కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. పట్టణంలోని అంగడి బజార్ ఏరియా బిటైప్ క్వాటర్స్ లో నలుగురు వ్యక్తులు గంజాయి విక్రయించి సేవిస్తున్నారనే సమాచారం మేరకు వెళ్లగా ఎస్సై రాజశేఖర్ ని చూసి పారిపోతున్న వీరి వద్ద నుంచి 355 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకుని అదుపులోకి తీసుకున్నారు. పట్టణానికి చెందిన మహమ్మద్ షఫీ, అదిల్ పెట్ గ్రామానికి చెందిన వేల్పుల రాకేష్, అంతర్గాం మండలానికి చెందిన కొలిపాక అరవింద్ రెడ్డి, జాడి కిరణ్ లుగా గుర్తించినట్లు మందమర్రి సీఐ శశిధర్ రెడ్డి పేర్కొన్నారు. గంజాయి సేవించిన అమ్మిన, రవాణా చేసిన చట్టరీత్యా కఠిన చర్యలు తప్పవని ఏసీపీ రవికుమార్ పేర్కొన్నారు.