ఒకే మాట.. ఒకే బాణం

One word.. One arrow

Aug 31, 2024 - 19:54
Aug 31, 2024 - 19:55
 0
ఒకే మాట.. ఒకే బాణం
కష్టనష్టాలకోరుస్తూ.. మెట్టుమెట్టు పై కెదుగుతూ
మెప్పించి ఒప్పిస్తున్న కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి
జమ్మూకశ్మీర్‌లోనూ కమలం జెండా రెపరెపలకు కృషి
నా తెలంగాణ, సెంట్రల్ డెస్క్:
అనేక కష్టనష్టాలకోర్చి ఆది నుంచి ఒకేమాట ఒకే బాణంలా ​​ఒకే పార్టీలో ఉన్న బీజేపీ నేత జి.కిషన్ రెడ్డి భుజస్కంధాలపై నరేంద్ర మోదీ ప్రభుత్వం మరో బాధ్యతను వేసింది. జమ్మూకశ్మీర్ ఎన్నికల ఇన్ చార్జీగా ఆయన్ను నియమించారు. ఇప్పటికే తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఓ వైపు కొనసాగుతూ, మరోవైపు కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రిగా జి.కిషన్ రెడ్డి నియమితులయ్యారు. 
 
కేంద్రం బాధ్యత వెనుక మర్మం..
ఆది నుంచి కిషన్ రెడ్డి ఒకే పార్టీలో ఉంటూ ఏ మాత్రం వెనక్కు తగ్గకుండా పార్టీ పటిష్ఠత కోసం అహర్నిశలు కృషి చేస్తూ మెప్పిస్తూ ఒప్పిస్తూ అందరి నిర్ణయాలను గౌరవిస్తూ పార్టీలో ఉన్నత స్థానానికి చేరగలిగారు. ఈ సమయంలో, కార్యకర్తల మెప్పుపొందే అనేక నిర్ణయాల్లో ఆచితూచి వ్యవహరించడమే గాక తాను తీసుకున్న విజయమే తప్ప అపజయం లేదని నిరూపించుకుంటూ వస్తున్నారు. ఇలాంటి పరిణామాలు బీజేపీ అధిష్ఠానం ఆది నుంచి గమనిస్తూ ఆయనకంటూ ప్రత్యేక గుర్తింపును అందజేస్తూ పార్టీ పటిష్ఠతకు మరింత బీజం వేస్తోంది.
 
జమ్మూకశ్మీర్ ఎన్నికల్లో మీడియా కార్యాలయం ఏర్పాటు చేశాక అక్కడే మకాం వేసి బీజేపీ అధిష్ఠానం ఆయనకు అప్పజెప్పిన బాధ్యతను అందరిలో ఒక్కడినై.. ఒక్కడిలో అందరినై అన్నట్లు ఉన్నారు. తొలి విడతలో జరగనున్న 24 నియోజకవర్గాల బీజేపీ నాయకులు, కార్యకర్తలు ప్రత్యేకంగా భేటీలు నిర్వహించడంలో ప్రస్తుతం ఉన్నారు. కీలక సమయంలో పార్టీకి అండగా ఉండాలని, పార్టీ వారికి ఉచిత స్థానాలను అందజేస్తున్నట్లు చెబుతున్నారు. అదేసమయంలో బూత్ స్థాయిలో పార్టీని బలోపేతం చేసే దిశగా చర్యలు చేపట్టారు. ప్రతీ బూత్ స్థాయి నుంచి 200మందిని పార్టీలో సభ్యత్వం పొందేలా విశేష కృషి చేస్తున్నారు. కేవలం సభ్యత్వం పొందేలా గాకుండానే వారి ద్వారా పార్టీ ఓట్ల శాతం పెంచే దిశగా ప్రయత్నిస్తున్నారు. జమ్మూకశ్మీర్‌లో కమల వికాసం కోసం కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి తీసుకుంటున్న చర్యలపై పలువురు జమ్మూకశ్మీర్ పార్టీ నేతలు కూడా స్వాగతిస్తుండడం విశేషం. ఆయన వ్యవహరించే ధోరణితోనే ప్రత్యేకతను సాధిస్తూ ముందుకు వెళ్లడం విశేషం. ఏది ఏమైనా బీజేపీ అధిష్ఠానం మదిలోనే గాకుండా దేశ ప్రజల మదిలోనూ తన కోసం సుస్థిరం చేసుకుంటున్న నాయకుడుగా కిషన్ రెడ్డి ఎదుగుతున్నారనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.