టీఎంసీది దుష్టపాలన

ఆరేడు దశాబ్ధాలుగా చీకట్లో దేశం ప్రజా సంకల్పం కోసం పెద్ద నిర్ణయాలు ఎస్సీ, ఎస్టీ జీవన విధానాల్లో మార్పులు భవిష్యత్​ తరాలకు సురక్షిత భారత్​అందజేయడమే లక్ష్యం ఎన్నికల సభలో ప్రధాని నరేంద్ర మోదీ

Apr 4, 2024 - 18:57
 0
టీఎంసీది దుష్టపాలన

కోల్​కతా: టీఎంసీ దుష్ట పరి పాలనపై పశ్చిమ బెంగాల్​ప్రజలు త్వరలో సమాధానం ఇవ్వనున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం పశ్చిమ బెంగాల్​లోని కుచ్​​బిహార్​లో నిర్వహించిన సభలో ప్రసంగించారు. ప్రపంచంలోని మూడో ఆర్థిక శక్తిగా భారత్​ను రూపొందించాల్సిన అవసరం ఉందని తెలిపారు. స్వాతంత్రం అనంతరం ఆరేడు దశాబ్దాలుగా దేశాన్నిప్రభుత్వాలు చీకట్లో ఉంచాయని తెలిపారు. మోదీ భారతదేశ ప్రజల సేవకుడని అన్నారు. 140 కోట్ల మంది కలలను నిజం చేసేందుకే పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకుంటున్నానని అన్నారు. ప్రజా సంకల్పం కోసమే ఈ  నిర్ణయాలన్నారు. నిరుపేదల సంక్షేమం కోసం అవినీతి, ఉగ్రవాదాన్ని తరిమికొట్టామన్నారు. గ్రామాల్లోని ఎస్సీ, ఎస్టీ జీవన విధానంలో మార్పు రావాలని కోరుకున్నామని స్పష్టం చేశారు. ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడంలో తాము నిర్మలంగా పనిచేస్తున్నామని, ఫలితాలు కూడా సాధిస్తున్నామని తెలిపారు. రాబోయే తరాలకు సురక్షిత, సమస్యలు లేని భారత్​ను అందంచాలన్నదే తమ కోరిక అన్నారు. ఏన్నో యేళ్లుగా నానుతున్న రామ మందిర సమస్యను తీర్చి దేవాలయాన్ని ఏర్పాటు చేశామన్నారు. 

బీజేపీకి ప్రజాశీర్వాదం అందించాలి..

పశ్చిమ బెంగా లో ఉచిత రేషన్, 40 లక్షల మందికి సొంత గృహాలు, మరుగుదొడ్లు, విద్యుత్, గ్యాస్, నీరు లాంటి మోదీ గ్యారంటీ పథకాలను అమలు చేశామన్నారు. పీఎం కిసాన్​ సమ్మాన్​ నిధి కింద రూ. 8500 కోట్ల రూపాయలు అందించామన్నారు. 10యేళ్లలో చేసింది కేవలం ట్రేలరేనని అన్నారు. ఇంకా తనకు చాలా పనిచేయాల్సి ఉందన్నారు. దేశాన్ని ప్రపంచంలో తొలివరుసలో నిలబెట్టాల్సిన అవసరం ఉందని ప్రధాని పేర్కొన్నారు. మోదీకి కుటుంబమే లేదని తన విరోధులు విమర్శిస్తున్నారని పేర్కొన్నారు. మోదీకి 140 కోట్ల పెద్ద కుటుంబం ఉందన్నారు. బెంగాల్​వికాసం కోసం కమలం వికసించేలా ప్రజలు ఆశీర్వదించాలని చెప్పారు. 

సందేశ్​ఖాలీ దోషులను వదిలిపెట్టం..

సందేశ్​ఖాలీ మహిళల వెంట టీఎంసీ పరాకాష్ఠను వదిలిపెట్టబోమన్నారు. దోషులకు శిక్ష పడేలా చర్యలు తీసుకుంటానని తెలిపారు. మహిళా స్వశక్తి సాధికారత బీజేపీ లక్ష్యమని మోదీ వివరించారు. మూడు కోట్ల మంది మహిళలను లక్పతీ దీదీలుగా చేస్తానని మోదీ గ్యారంటీ ఇచ్చారు. బంగ్లాదేశ్​లోకి రాకపోకలను న్యాయబద్ధం, చట్టపరంగా ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. రాజవంశీ, నామశూద్ర, మతువా జాతులను ఎప్పుడు టీఎంసీ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. ఇప్పుడు ఎన్నికలు సమీపించడంతో వారి భజన చేస్తోందని విమర్శించారు. 

కాంగ్రెస్, టీఎంసీ, లెఫ్ట్​ అవినీతి పార్టీలు..

పశ్చిమ బెంగాల్​లో రేషన్, ఉపాధ్యాయ నియామకాల కుంభకోణంలో పాలుపంచుకున్న వారిని రక్షించే పనిలో కాంగ్రెస్, టీఎంసీ, లెఫ్ట్​ పార్టీలు ఉన్నాయన్నారు. ఈ పార్టీలకు దేశ సంక్షేమం ఎంతమాత్రం పట్టదని మోదీ మండిపడ్డారు. టీఎంసీ నాయకుల ఇంట్లో డబ్బు కట్టలు దొరకడం దేశమంతా చూసిందని గుర్తు చేశారు. పశ్చిమ బెంగాల్​కు కేంద్రం ఎన్నో నిధులు కేటాయించినా సమయానికి ప్రాజెక్టులు పూర్తి చేయడం లేదని మోదీ తెలిపారు. ఆయుష్మాన్​ లాంటి అద్భుత పథకాన్ని తిరస్కరించడం ప్రజాసంక్షేమాన్ని విస్మరించడమేనని తెలిపారు. ప్రజలు ఈ విషయాన్ని జ్ఞప్తిలో పెట్టుకొని ఏప్రిల్​ 19న టీఎంసీ ప్రభుత్వానికి సరైన సమాధానం చెప్పాలని, బీజేపీని ఆశీర్వదించాలని ప్రధాని మోదీ విజ్ఞప్తి చేశారు.