అమర్​ నాథ్​ దర్శనానికి 990మంది

తక్కువమంది యాత్రికుల బృందంగా నమోదు బాబాను దర్శించుకున్న 4.85 లక్షల మంది భక్తులు

Aug 3, 2024 - 15:06
 0
అమర్​ నాథ్​ దర్శనానికి 990మంది

శ్రీనగర్​: అమర్​ నాథ్​ యాత్రకు 990మందితో కూడిన మరో యాత్రికుల బృందం జమ్మూలోని భగవతి నగర్​ బేస్​ క్యాంప్​ నుంచి బయలుదేరినట్లు అమర్​ నాథ్​ క్షేత్ర ట్రస్ట్ శనివారం తెలిపింది. ఈ బృందంలో 152 మంఇ మహిళలుండగా, 41మంది సాధువులు, 9మంది సాధ్వీలు న్నారని, ఇది 37వ యాత్ర బృందం అని తెలిపింది. శనివారం తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో ఈ బృందం బయలుదేరిందని తెలిపింది. 815మంది పహిల్గామ్​ మార్గంలో, 176 మంది బల్తాల్​ మార్గం ద్వారా వస్తున్నారని తెలిపింది. కాగా యాత్ర ప్రారంభమైనప్పటి నుంచి శనివారం వస్తున్న 990 మంది అతి చిన్న యాత్రికుల బృందంగా నమోదైనట్లు తెలిపింది. ఈ యాత్రికుల సంఖ్యతో కలిపితే ఈ రోజు వరకు 4.85 లక్షల మంది యాత్రికులు అమర్​ నాథ్​ ను దర్శించుకున్నారని ఆలయ ట్రస్టు స్పష్టం చేసింది.