ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి పర్యాటక రంగం కీలక భాగస్వామ్యం

కేంద్రమంత్రి గజేంద్ర సింగ్​ షెకావత్​

Aug 3, 2024 - 15:52
 0
ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి పర్యాటక రంగం కీలక భాగస్వామ్యం
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: భారత ఆర్థిక వ్యవస్థలో పర్యాటక రంగానికి కీలక భాగస్వామ్యం వహించే సత్తా ఉందని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్​ షెకావత్​ అన్నారు. గ్రేటర్​ నోయిడాలో శనివారం జరిగిన అంతర్జాతీయ హాస్పిటాలిటీ ఎక్స్​ పో–2024 ఏడో ఎడిషన్​ ను ప్రారంభించారు. అనంతరం షెకావత్​ మాట్లాడుతూ.. దేశంలో వ్యవసాయం, పర్యాటకం రెండు కీలక రంగాలన్నారు. దేశంలోని అనేక పర్యాటక ప్రాంతాలలో టూరిజం వృద్ధి పెరుగుతోందన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని తీసుకుంటున్న చర్యల వల్ల సత్ఫలితాలు సాధిస్తున్నామని తెలిపారు. 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి దేశంగా మార్చేందుకు మోదీ నేతృత్వంలో కలిసి కట్టుగా పనిచేస్తామని షెకావత్​ పునరుద్ఘాటించారు. పర్యాటక రంగం అగ్రగామికి నిలిచేందుకు ప్రతీ ఒక్కరూ సహకరించాలని మంత్రి షెకావత్​ విజ్ఞప్తి చేశారు.