సిక్కులపై వ్యాఖ్యలు బాబా ఆవేదన

Baba's comments on Sikhs are a pain

Sep 21, 2024 - 21:13
 0
సిక్కులపై వ్యాఖ్యలు బాబా ఆవేదన

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: తన అమెరికా పర్యటనలో సిక్కు వ్యాఖ్యలపై బీజేపీ అసత్య ప్రచారం చేస్తోందని రాహుల్​ గాంధీ (బాబా) ఆవేదన వ్యక్తం చేశారు. అమెరికాలో బాబా చేసిన వ్యాఖ్​యలపై యూటర్న్​ తీసుకున్నారు.  సిక్కులపై అమెరికాలో రాహుల్​ చేసిన వ్యాఖ్యలపై బీజేపీతోపాటు పలువురు తూర్పారబట్టడం తెలిసిందే. ఈ నేపథ్యంలో శనివారం రాహుల్​ గాంధీ స్పందించారు. తనపై లేని పోని ఆరోపణలు, వ్యాఖ్యలు చేస్తున్నారని బాబా మండిపడ్డారు. విదేశాలలో నివసిస్తున్న ప్రతి సిక్కు సోదరుడు, సోదరీమణులను నేను అడగాలనుకుంటున్నాను - నేను మాట్లాడిన దానిలో ఏదైనా తప్పు ఉందా? అని ప్రశ్నించారు. బీజేపీ తనను మౌనంగా ఉంచేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. భారతదేకశం విలువలు, సమానత్వం, ఐక్యతకు చిహ్నామన్నారు.