పీఎంయూవై కింద 8 కోట్ల గ్యాస్​ కనెక్షన్లు

8 crore gas connections under PMUY

Dec 12, 2024 - 18:06
 0
పీఎంయూవై కింద 8 కోట్ల గ్యాస్​ కనెక్షన్లు

కేంద్ర సహాయ మంత్రి సురేష్​ గోపీ

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: పీఎం ఉజ్వల యోజన (పీఎంయూవై) 2.0 కింద 2016 నుంచి 2019 వరకు 8 కోట్ల ఎల్పీజీ కనెక్షన్లు అందజేశామని, 2025–26 వరకు దేశంలో 1.6 కోట్ల ఎల్పీజీ కనెక్షన్లను జారీ చేయాలని లక్ష్యంగా నిర్దేశించామని కేంద్ర పెట్రోలియం, సహజవాయువు శాఖ సహాయ మంత్రి సురేష్​ గోపీ గురువారం లోక్​ సభకు లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు.  2016లో ప్రారంభించిన ఈ పథకం ద్వారా ఎల్పీజీ అందుకున్న వారి సంఖ్యలో పెరుగుదల ఏర్పడిందన్నారు. పీఎంయువై ఫేజ్​ 1 కింద 8 కోట్ల ఎల్పీజీ కనెక్షన్లు 2019వరకు అందజేశామని లక్ష్యాన్ని సాధించామన్నారు. ఫేజ్​ 2.0 కింద మరో 1.6 కోట్ల ఎల్పీజీ కనెక్షన్లు జారీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. అవాంతరాలు లేని బుకింగ్​ కోసం మెరుగైన సౌకర్యాన్ని అందిస్తున్నామన్నారు. ఐవీఆర్​ఎస్​, వాట్సాప్​ ద్వారా నేరుగా పంపిణీ దారులు, ఇ–కామర్స్​ ఫ్లాట్​ ఫారమ్​ లు, ఆయిల్​ మార్కెటింగ్​ కంపెనీల ఫోన్​ నంబర్​ కు కాల్​ చేస్తూ పథకాన్ని వినియోగించుకోవచ్చని కేంద్ర మంత్రి సురేష్​ గోపి తెలిపారు.