సనాతనానికి ఔరంగజేబు హానీ
Aurangzeb's harm to Hinduism
వారి వారసులు రిక్షాలు తొక్కుతున్నారు
యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్
లక్నో: ఔరంగజేబు దేవునికి (సనాతన ధర్మానికి) హాని కలిగించకుండా ఉంటే ఈ రోజు వారి వారసులు రిక్షాలు నడిపించుకునేవారు కాదని ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ సంచలన ప్రకటన చేశారు. యూపీ అయోధ్యలో జరిగిన ఓ కార్యక్రమంలో శుక్రవారం ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రపంచ మానవాళి రక్షణకు సనాతన ధర్మమే ఉత్తమమైన మార్గమని యోగి ఆదిత్యనాథ్ స్పష్టం చేశారు. వసుదైక కుటుంబం మరొకటి కాదని ప్రపంచంలో ఉన్న అందరూ కుటుంబమేనన్నారు. ఎంతటివారైనా సనాతన ధర్మాన్ని గౌరవించాల్సిందేనన్నారు. విపత్తుల సమయంలో ప్రతీఒక్కరికి కులం, మతం, వర్ణం అని చూడకుండా ఆపన్నహస్తం అందించింది సనాతన ధర్మమేనని గుర్తు పెట్టుకోవాలన్నారు. అదే విషయం హిందువుల వద్దకు వచ్చేసరికి ఏనాడూ పాక్, ఆఫ్ఘాన్, బంగ్లాలో ఇలా జరగలేదన్నారు. వారు హిందువులపై అన్యాయాలు, ఆకృత్యాలకే పాల్పడ్డారని మండిపడ్డారు. సనాతన ధర్మం ఆకలి తీరిస్తే, ఈ దేశాలు హిందువుల ప్రాణాలను హరించాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
జౌరంగజేబు పాలనలో హిందువుల దేవాలయాలన్నీ కూల్చారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇతని పాలన మొత్తం సనాతన ధర్మానికి పూర్తి వ్యతిరేకమని సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు.