బలూచ్​ డుకీ గని కార్మికులపై ఉగ్ర కాల్పులు

Fierce firing on Baloch Duki miners

Oct 11, 2024 - 12:52
 0
బలూచ్​ డుకీ గని కార్మికులపై ఉగ్ర కాల్పులు

20మంది మైనర్ల మృతి, ఏడుగురికి తీవ్ర గాయాలు
చైనా–పాక్​ సీపెక్​ తో పెరుగుతున్న హింసాత్మక ఘటనలు 

క్వెట్టా: పాక్​ లోని నైరుతి ప్రాంతంలో ఉగ్రవాదులు(బీఎల్​ ఏ–బలూచ్​ లిబరేషన్​ ఆర్మీ) శుక్రవారం భారీ దాడికి పాల్పడింది. డుకీ బొగ్గు గని సమీపంలోని కూలీల నివాసాలపై ఒక్కసారిగా విరుచుకుపడింది. ఉగ్ర కాల్పుల్లో 20 మంది మైనర్లు మృతి చెందగా, మరో ఏడుగురికి తీవ్ర గాయాలైనట్లు బలూచ్ ప్రావిన్స్​ డుకీ పోలీసు ఉన్నతాధికారి హుమాయున్​ కాన్​ నాసిర్​ తెలిపారు. గ్రెనేడ్లు, రాకెట్​ లాంచర్లతో దాడికి పాల్పడ్డారని తెలిపారు. అనంతరం ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి విచక్షణా రహితంగా కాల్పులకు తెగబడ్డారన్నారు. ఈ దాడికి ఇంకా ఏ ఉగ్ర సంస్థ బాధ్యత వహించలేదని దాడిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టామన్నారు. 

ఇరాన్​, ఆఫ్ఘాన్​ సరిహద్దులో ఉన్న బలూచ్​ లో చాలాకాలంగా హింసాత్మక తిరుగుబాటుకు కేంద్రంగా నిలుస్తోంది. 
ముఖ్యంగా చైనా–పాక్​ చేపట్టిన సీపెక్​ ప్రాజెక్టుతో హింసాత్మక ఘటనలు మరిన్ని పెరిగాయి. బలూచ్​ సంపదను విదేశాలకు దోచిపెట్టడమే గాక, పాక్​ బాగుపడుతుందని, తమ ప్రాంత బాగోగులు ఏ మాత్రం పట్టించుకోవడం లేదని బీఎల్​ ఏ ఆరోపిస్తూ దాడులకు తెగబడుతుంది.