కౌశిక్ పై పొన్నం పరువు నష్టం దావా
Ponnam defamation suit against Kaushik
నా తెలంగాణ, హైదరాబాద్: రూ. 100 కోట్ల ఫ్లయ్ యాష్ కుంభకోణం ఆరోపణలపై బీఆర్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పరువునష్టం నోటీసులు పంపారు. రామగుండంలోని నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లో కుంభకోణం చేశారని ఆయనతోపాటు పలు పత్రికల్లో ఆరోపించారు. ఆదివారం వీరందరికీ నోటీసులు పంపించినట్లు పొన్నం వివరించారు.
తన మేనల్లుడు ప్రభాకర్ కూడా ఆ కుంభకోణంలో డబ్బులు అందుతున్నాయని కౌశిక్ ఆరోపణలను పొన్నం ఖండించి పరువు నష్టం దావా వేశారు.