రూ.15వేల కోట్ల జీఎస్టీ మోసం మహిళా వ్యాపారవేత్త అరెస్ట్​

15 thousand crores GST fraud woman businessman arrested

Jun 23, 2024 - 17:27
 0
రూ.15వేల కోట్ల జీఎస్టీ మోసం మహిళా వ్యాపారవేత్త అరెస్ట్​

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: జీఎస్టీ రూ. 15వేల కోట్ల మోసంలో నోయిడా పోలీసులు కోయంబత్తూరులో ఓ మహిళా వ్యాపారవేత్తను ఆదివారం అరెస్టు చేశారు. మోసంలో ఈమె కూడా భాగస్వామ్యం వహించినట్లు గుర్తించారు. కాగా ఈమెతోపాటు మొత్తం 40 మంది జీఎస్టీ మోసం కేసులో ఉన్నారని తెలిపారు. వీరిలో చాలామందిని అరెస్టు చేయగా, మరో ముగ్గురు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. 33 మందిపై చర్యలు కూడా తీసుకున్నామని తెలిపారు. ఢిల్లీ తిలక్​ నగర్​ లో ఉంటున్న ప్రముఖ వ్యాపారవేత్త తుషార్​ గుప్తా దీనికంతటికి ప్రధానకారకుడన్నారు. అతన్ని గతంలోనే అరెస్టు చేశామని పోలీసులు స్పష్టం చేశారు. ఈ మోసంపై కొత్వాలి సెక్టార్​ లో కేసు నమోదైంది.