370పై కాంగ్రెస్ యూటర్న్
నష్టం లేదన్న సీఎం ఒమర్ అబ్దుల్లా
శ్రీనగర్: ఆర్టికల్ 370 పునరుద్ధరణపై కాంగ్రెస్ పార్టీ యూటర్న్ తీసుకున్న తమకొచ్చిన నష్టం ఏమీ లేదని జేకేసీఎం ఒమర్ అబ్దుల్లా అన్నారు. శుక్రవారం జమ్మూకశ్మీర్ అసెంబ్లీలో రాజ్యాంగ హామీలను పునరుద్ధరించాలని చర్చను కోరుతూ అసెంబ్లీ తీర్మాణంపై మాట్లాడారు. బీజేపీని లక్ష్యంగా చేసుకొని కాంగ్రెస్ తాము ప్రవేశపెట్టిన తీర్మానానికి మద్ధతు తెలపలేదన్నారు. ఇది తీర్మానంపై ఎలాంటి ప్రభావితం చూపబోదన్నారు. తీర్మానాన్ని ఇంకా తిరస్కరింపబడలేదని చెప్పారు. రాష్ర్ట హోదాను పూర్తిగా తిరిగి పొందుతామన్నారు. అదే సమయంలో కాంగ్రెస్ ఇందులో భాగం కాదని స్పష్టం చేశారు.