రిటైల్​ ద్రవ్యోల్బణం 6.21 శాతానికి పెరుగుదల

కేంద్ర గణాంకాల మంత్రిత్వ శాఖ నివేదిక వెల్లడి

Nov 12, 2024 - 18:46
 0
రిటైల్​ ద్రవ్యోల్బణం 6.21 శాతానికి పెరుగుదల

ఆహార పదార్థాలు, కూరగాయల ధరల్లో 42 శాతం పెరుగుదల నమోదు

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: భారతదేశ రిటైల్​ ద్రవ్యోల్బణం 6.21 శాతానికి పెరిగినట్లు కేంద్ర గణాంకాల మంత్రిత్వ శాఖ మంగళవారం విడుదల చేసిన నివేదికలో స్పష్టం చేసింది. సెప్టెంబర్‌లో ఇది 5.49 శాతానికి పెరిగింది. ద్రవ్యోల్బణం ఆహార పదార్థాలు, కూరగాయల ధరలు 42శాతం పెరిగేందుకు కారణమైందన్నారు. ఈ యేడాది ఋతుపవనాలు ఆలస్యంగా రావడం, పంటలు దెబ్బతిని సరఫరా తగ్గిపోయాయన్నారు. పప్పులు, గుడ్లు, పంచదార, మసాలా దినుసులు వంటి ఆహార పదార్థాల ధరలు తగ్గాయని, అయితే కూరగాయలు, పండ్లు, వంటనూనెల ధరలు బాగా పెరిగాయని మంత్రిత్వ శాఖ తెలిపింది. అక్టోబర్‌లో ఎడిబుల్ ఆయిల్ ధరలు 9.51శాతం పెరిగాయి. ఇతర రంగాల్లో ద్రవ్యోల్బణం ధరల్లో పెరుగుదల కనిపించింది. గృహ ద్రవ్యోల్బణం అక్టోబర్ నెలలో 2.81 శాతానికి పెరగగా, సెప్టెంబర్‌లో 2.72శాతంగా నమోదైంది. 
ఆర్బీఐ ప్రకటించిన రిటైల్​ ద్రవ్యోల్బణం 6 శాతానికి మించి పెరగడం ఇదే తొలిసారి. ఆర్బీఐ 4 శాతం ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచాలని లక్ష్యంగా పెట్టుకోగా, 6 శాతం గరిష్ట పరిమితిగా నిర్ణయించింది. ద్రవ్యోల్బణాన్ని స్థిరీకరించేందుకు ఆర్బీఐ మరిన్ని చర్యలు చేపట్టాల్సి ఉంది.