కుప్పకూలిన మూడంస్థుల భవనం శిథిలాల కింద 10మంది?
10 people under the rubble of the collapsed three-story building?
లక్నో: మీరట్ లో మూడంస్థుల భవనం కుప్పకూలింది. భవనం శిథిలాల కింద 10మంది ఉన్నట్లుగా స్థానికులు చెబుతున్నారు. శనివారం సాయంత్రం మీరట్ లోని జాకీర్ కాలనీలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అధికారులు, పోలీసులకు స్థానికులు సమాచారం అందించి సహాయక చర్యల్లో పాల్గొన్నారు. ఆ ప్రాంతం ఇరుకైనది కావడంతో పెద్ద యంత్రాలు వెళ్లడం సాధ్యం కావడం లేదు. దీంతో ఎన్డీఆర్ఎఫ్, పోలీసులు స్థానికుల సహాయంతో శిథిలాల తొలగింపు ప్రక్రియను చేపట్టారు. ప్రమాదం విషయం తెలుసుకున్న సీఎం యోగి ఆదిత్యనాథ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. సహాయక చర్యలు వేగంగా చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలన్నారు. ప్రమాద వివరాలు ఎప్పటికప్పుడు సీఎంవో కార్యాలయానికి అందజేయాలన్నారు.