ఉక్రెయిన్​పై రష్యా మూడో అతిపెద్ద దాడి

మాస్కోలోని కాన్సర్ట్ హాల్‌పై దాడి తర్వాత రష్యా ప్రతీకార చర్యలకు దిగింది. దేశాధ్యక్షుడు పుతిన్​ దాడివెనుక ఉక్రెయిన్​ హస్తం ఉందని బహిరంగంగానే ఆరోపించాడు.

Mar 24, 2024 - 17:25
 0
ఉక్రెయిన్​పై రష్యా మూడో అతిపెద్ద దాడి

కీవ్:  మాస్కోలోని కాన్సర్ట్ హాల్‌పై దాడి తర్వాత రష్యా ప్రతీకార చర్యలకు దిగింది. దేశాధ్యక్షుడు పుతిన్​ దాడివెనుక ఉక్రెయిన్​ హస్తం ఉందని బహిరంగంగానే ఆరోపించాడు. ఈ నేపథ్యంలో శనివారం అర్థరాత్రి తరువాత రష్యా ఉక్రెయిన్​పై మిస్సైళ్లతో విరుచుకుపడింది. టియూ–95ఎంఎస్​ బాంబర్ల ద్వారా ప్రయోగించిన క్రూయిజ్ క్షిపణులను రష్యా ఉపయోగించిందని కీవ్ సైనిక పరిపాలన అధిపతి సెర్హి పాప్కో తెలిపారు. రష్యాలోని సరాటోవ్ ప్రాంతంలోని ఎంగెల్స్ జిల్లా నుంచి దాడులు ప్రారంభించినట్లు ఆయన తెలిపారు.ఇంతవరకు ఉక్రెయిన్​పై రష్యా జరిపిన దాడిలో ఇది మూడో అతిపెద్ద దాడిగా పలువురు అభివర్ణిస్తున్నారు. ఉన్నట్లుండి వందలకొద్దీ క్షిపణులు ఆకాశం నుంచి దూసుకొస్తే జనావాసాలు, రోడ్లపై పడుతుండడంతో ఉక్రెయిన్​లోని ప్రజలు తమ ప్రాణాలు కాపాడుకునేందుకు హాహాకారాలు చేస్తూ పరుగులు తీశారు. ఐఎస్​ఐఎస్​ రష్యా విధ్వంసం కాస్త రష్యా–ఉక్రెయిన్​ మధ్యలో మరోసారి చిచ్చురేపినట్లయింది. కాగా ఈ దాడుల్లో ప్రాణ, ఆస్థి నష్ట వివరాలింకా తెలియరాలేదు.