పాక్​ సార్వభౌమాధికారాన్ని గౌరవించాలి పాక్​ అణుబాంబులు కలిగిన దేశం

పిట్రోడా మంటలు చల్లారనే లేదు మణిశంకర్​ అయ్యర్​ వివాదాస్పద వ్యాఖ్యలు మండిపడుతున్న నెటిజన్లు

May 10, 2024 - 14:14
 0
పాక్​ సార్వభౌమాధికారాన్ని గౌరవించాలి పాక్​ అణుబాంబులు కలిగిన దేశం

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: ‘ఇంట గెలిచి రచ్చ గెలవాలి’ అనే నానుడి ఒకటుంది. అదేమో గానీ కాంగ్రెస్​ నాయకులు ఈ సామెతను విని నట్లు లేదు. ఏమైనా భారత్​ వ్యతిరేక శక్తులను ప్రశంసించడం, భారత్​ ను విమర్శించడం లాంటి పనులను పెట్టుకుంటారు. హిందూ వ్యతిరేకులుగా ఇప్పటికే ముద్ర పడ్డ వీరు ఇలాగే ప్రవర్తిస్తే, దేశ విద్రోహ శక్తులుగా ముద్ర పడేందుకు ఎంతోకాలం పట్టదన్నది తెలుసుకుంటే మంచిది. వివరాల్లోకి వెళితే..

ఇప్పటికే శ్యామ్​ పిట్రోడా వ్యాఖ్యలు ఓ వైపు తీవ్ర దుమారాన్నే రేపుతుంటే, మరోవైపు అదే కాంగ్రెస్​ పార్టీ నాయకుడు మణిశంకర్​ అయ్యర్​ మరో వివాదాస్పద ప్రకటన చేశారు. పాక్​ వద్ద అణుబాంబులున్నాయని సార్వభౌమాధికార దేశమని దాన్ని మనం గౌరవించాలని ఉచిత సలహాలిచ్చాడు. ఓ వైపు ఉగ్రవాదులను ఎగదోస్తూ భారత్​ లో అనేక దాడులకు అనేక చావులకు కారణమైన దేశాన్ని ఈయన గౌరవించాలనడంపై సామాజిక మాధ్యమాల్లో తిట్టిపోస్తున్నారు. ఉగ్రవాదంతో నేరుగా దోస్తీ నెరుపుతున్న పాక్​ ప్రభుత్వం ఐఎస్​ ఐ కథలు అయ్యర్​ వినలేదేమో, చదవలేదెమో అనే విమర్శలు వినిపిస్తున్నాయి. 

మణిశంకర్​ అయ్యర్​ చేసిన ఈ వ్యాఖ్యల వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​ గా మారడంతో వెలుగులోకొచ్చింది. చర్చల ద్వారా బాంబులు, తొపాకుల వినియోగాన్ని ఆపాలని ఆయన అన్నారు. పాక్​ తో సమస్యలను పరిష్కరించుకోవాలని భారత్​ చూస్తోందన్నారు. ఇందుకోసం చర్చలు జరపాల్సిన అవసరం ఉందన్నారు. పది సంవత్సరాలలో ఎటువంటి చర్చలు లేకపోవడం కూడా విఘాతం కలిగిస్తాయన్నారు. 
కాగా అయ్యర్​ ఇటీవల లాహోర్​ లో జరిగిన ఫ్రైజ్​ మహోత్సవ లో పాల్గొన్నారు. పాక్​ ప్రజలు ప్రేమను కురిపిస్తారన్నారు. పాక్​ కాశ్మీర్​ విధానం పట్ల గర్వపడుతున్నట్లు చెప్పారు. పాకిస్థానీయులు భారత్​ ను ఎంత ప్రేమిస్తారో? పాక్​ ను కూడా అంతే ప్రేమిస్తారని తెలిపారు. 
కాగా ఈయన వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి.