జమ్మూకశ్మీర్ లో 40 స్థానాల్లో కొనసాగుతున్న పోలింగ్
ఉదయం 11 గంటల వరకు ఏడు జిల్లాల్లో 28 శాతం నమోదు
శ్రీనగర్: జమ్మూకశ్మీర్ లో మూడోవిడత (ఆఖరివిడత) ఎన్నికలు మంగళవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమయ్యాయి. ఉదయం 11 గంటల వరకు 28 శాతం పోలింగ్ నమోదైంది. 40 స్థానాల్లో జరుగుతున్న ఈ ఎన్నికలు జమ్మూలోని 24, కాశ్మీర్ లోని 16 స్థానాల్లో జరుగుతున్నాయి. 415 మంది అభ్యర్థులు బరిలో ఉండగా వీరిలో 387మంది పురుషులు 28 మంది మహిళా అభ్యర్థులు పోటీలో ఉన్నారు. 39.18 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.
ఏడు జిల్లాల్లోని 40 స్థానాల్లో జరుగుతున్న ఓటింగ్ 28 శాతం పోలయ్యాయి. బందీపోరా, బారాముల్లా, ఉదమ్ పూర్, సాంబా, కుప్వారా, కథువా, జమ్మూ జిల్లాలో ప్రశాంతంగా ఓటింగ్ కొనసాగుతోంది.