ఉత్తరగాజాపై దాడి 22 మంది మృతి
కాల్పుల విరమణ డిమాండ్ ను లేవనెత్తిన ఇరాన్
టెల్ అవీవ్: ఉత్తర గాజాపై ఇజ్రాయెల్ సైన్యం మరో భారీ దాడికి దిగింది. ఈ దాడుల్లో కనీసం 22 మంది చనిపోయారు. పాలస్తీనా వైద్య అధికారులు ఆదివారం ఈ సమాచారం ఇచ్చారు. ఉత్తర నగరమైన బీట్ లాహియాలో శనివారం అర్థరాత్రి ఇజ్రాయెల్ సైన్యం దాడి చేసిందని గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ అత్యవసర సేవ తెలిపింది. ఈ దాడిలో 11 మంది మహిళలు, ఇద్దరు చిన్నారులు కూడా చనిపోయారు. గాజా, లెబనాన్‌లపై ఇజ్రాయెల్ నిరంతరం క్షిపణి, భూదాడులు చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, గాజా, లెబనాన్‌లలో కాల్పుల విరమణ కోసం ఇరాన్ డిమాండ్‌ను లేవనెత్తింది. ఇరాన్ ప్రతిపాదనపై ఇజ్రాయెల్ ఏం నిర్ణయం తీసుకుంటుందనేది వేచి చూడాలి.