నిధులపై కాగ్​ రిపోర్టు బీఆర్​ఎస్​, కాంగ్రెస్​ లకు చెంపచెళ్లు

బీజేపీ రాష్ర్ట అధికార ప్రతినిధి రాణీ రుద్రమ

Aug 4, 2024 - 17:27
 0
నిధులపై కాగ్​ రిపోర్టు బీఆర్​ఎస్​, కాంగ్రెస్​ లకు చెంపచెళ్లు

నా తెలంగాణ, హైదరాబాద్​: కేంద్రం తెలంగాణకు ఇచ్చిన నిధులను కాగ్​ రిపోర్టు ద్వారా వెల్లడించడంతో బీఆర్​ఎస్​, కాంగ్రెస్​ పార్టీలకు చెంపచెళ్లుమందని బీజేపీ రాష్ర్ట అధికార ప్రతినిధి రాణీ రుద్రమ అన్నారు. ఆదివారం రాష్ర్ట బీజేపీ కార్యాలయంలో కాగ్​ రిపోర్టుపై ఇరు పార్టీల తీరును తూర్పారబడుతూ విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. 

2016–2022 కాగ్​ రిపోర్టులో వాస్తవాలు..
కేంద్రం ఓ వైపు తెలంగాణకు నిధుల కేటాయింపులో అత్యధిక ప్రాధాన్యం ఇస్తుందన్న విషయం కాగ్​ రిపోర్టుతో స్పష్టం అవుతుందన్నారు. 2016 నుంచి 2022 వరకు సంబంధించిన నిధుల రిపోర్టును చూస్తే ఈ విషయం అవగతం అవుతుందని రుద్రమ తెలిపారు.ఓ వైపు నిధులు తీసుకుంటూనే మరోవైపు నిధులు దక్కలేదని అవాస్తవాలను సీఎం రేవంత్​ రెడ్డి, మంత్రులు చెప్పడం శోచనీయమన్నారు. కాగ్​ రిపోర్టు బీఆర్​ ఎస్​ పార్టీకి కూడా చెంపపెట్టులాంటిదన్నారు. వైద్య ఆరోగ్య శాఖకు కేంద్రం కేటాయించిన నిధులు, తిరిగి వెళ్లిపోయిన విషయాన్ని కూడా ఈ నివేదికలో పేర్కొన్నారని తెలిపారు. 

2016 నుంచి 2022 వరకు కేంద్రం తెలంగాణకు కేటాయించిన నిధులపై నివేదిక అందజేశారు.
2016-17లో రూ. 1201 కోట్లు అందజేయగా, 2017-18లో రూ.1660, 2018-19లో రూ.1466, 2019-20లో రూ.2030, 2020-21లో రూ.2310, 2012-22లో రూ.939కోట్లను అందజేశారని తెలిపారు. ఇంతేగాక నేషనల్ హెల్త్ మిషన్ కింద కేంద్రం వాట 60 శాతం ఉందన్నారు. 

కేంద్రం నిధులను తమవిగా చెప్పుకుంటారా?..
ఐటీడీఏ కింద 25కోట్ల రూపాయలు కేంద్రం ఇస్తే తెలంగాణ ప్రభుత్వం మాత్రం కేవలం రూ. 12.5 కోట్లు మాత్రమే ఖర్చు చేసి చేతులు దులుపుకుందన్నారు. ఎన్​ పీసీడీసీఎస్​ కింద కేంద్రం రూ. 32.59 కోట్లు ఇస్తే రాష్ర్టం తన వాటానే విడుదల చేయకపోవడం విడ్డూరమన్నారు. ఆయూష్​ కింద గత ఆరేళ్లలో కేంద్ర ప్రభుత్వం రూ. 68 కోట్లను, టీబీ నియంత్రణకు రూ. 176 కోట్లను, కుష్ఠు వ్యాధి నివారణకు రూ. 24 కోట్లు, మలేరియా నివారణకు కోట్లాది రూపాయలను కేటాయిస్తే ఇరు ప్రభుత్వాలు కూడా ఆ నిధులన్నీ తామే విడుదల చేస్తున్నట్లుగా బిల్డప్​ కొట్టుకుంటున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఇరుపార్టీల కుటీల యత్నాలో తెలంగాణ అభివృద్ధికి దూరం..
పీఎం మాతృవందన యోజన కింద కేంద్రం నిధులు కేటాయిస్తే మాజీ సీఎం కేసీఆర్​ కిట్​ కంటే ఎక్కువ పేరు మోదీకి వస్తుందని ఆ నిధులనే వాడుకోలేదన్నారు. ఆసుపత్రుల నిర్మాణం కోసం నిధులిస్తే దారి మళ్లించారని ఆరోపించారు. దారిమళ్లించిన నిధులను తీసుకొని కూడా తీసుకోలేదని పచ్చి అబద్ధాలు చెబుతున్నారని రాణీ రుద్రమ మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి బంగారు బాతు గుడ్డు లాంటి ప్రయోజనాలను చేకూరుస్తుంటే బీఆర్​ఎస్​, కాంగ్రెస్​ లు కుటీల యత్నాలకు, ఆరోపణలకు పాల్పడుతూ తెలంగాణ అభివృద్దిని నిర్లక్ష్యం చేస్తున్నారని రాణీ రుద్రమ మండిపడ్డారు.