జమ్మూకశ్మీర్​ కు రాష్ట్ర హోదా కేంద్రం అంగీకారం

శీతాకాల సమావేశాల్లో ప్రతిపాదన

Oct 27, 2024 - 12:43
 0
జమ్మూకశ్మీర్​ కు రాష్ట్ర హోదా కేంద్రం అంగీకారం

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: జమ్మూకశ్మీర్​ కు రాష్ట్ర హోదా కల్పించేందుకు కేంద్రం అంగీకారం లభించింది. పార్లమెంట్​ శీతాకాల సమావేశాల్లోనే ప్రతిపాదన చేయనున్నారు. అదే సమయంలో లడఖ్​ మాత్రం కేంద్ర పాలిత ప్రాంతంగానే కొనసాగనుంది. జమ్మూకశ్మీర్​ సీఎం ఒమర్​ అబ్దుల్లా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్​ షాతో ఇటీవలే భేటీ అయ్యారు. రాష్ర్ట హోదాపై విజ్ఞప్తి చేశారు. దీంతో కేంద్రం కేబినెట్​ భేటీలో ఈ అంశాన్ని చర్చించి ఏకాభిప్రాయం సాధించి అంగీకారం లభించి ఆమోదం తెలిపింది. అనంతరం జమ్మూకశ్మీర్​ ఎల్జీకి ప్రతిపాదనను పంపారు. గవర్నర్​ ఆ ప్రతిపాదనను ఆమోదించి హోంమంత్రిత్వ శాఖకు పంపారు. 

2019లో ఆర్టికల్‌ 370, 35ఎలను తొలగించి జమ్మూ కాశ్మీర్‌, లడఖ్‌లను రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చిన తర్వాత పూర్తి రాష్ట్ర హోదాను పునరుద్ధరిస్తామని ఆ సమయంలోనే ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఇటీవల జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీజేపీ ఇదే విషయాన్ని పునరావృతం చేసింది.