శ్రీ లక్ష్మి యోగానికి ఆరు ముహూర్తాలు

Six Muhurtas of Shri Lakshmi Yoga

Oct 30, 2024 - 18:08
Oct 30, 2024 - 18:08
 0
శ్రీ లక్ష్మి యోగానికి ఆరు ముహూర్తాలు
నా తెలంగాణ, సెంట్రల్ డెస్క్: దేశవ్యాప్తంగా అక్టోబర్ 31 మహాలక్ష్మి యోగంలో దీపావళికి ఆరు శుభముహూర్తాలను వేదపండితులు ప్రకటించారు. అమావాస్య అక్టోబర్ 31 సాయంత్రం 4 గంటల తర్వాత ప్రారంభమై నవంబర్ 1 సాయంత్రం వరకు ఉంటుంది. అందుకే దేశంలోని చాలా ప్రాంతాల్లో దీపావళిని అక్టోబర్ 31న జరుపుకుంటున్నారు. ఈ రోజు లక్ష్మిపూజకు, నూతన పనుల ప్రారంభానికి శుభప్రదంగా నిలవనుంది. గురువారం శష, కులదీపక, శంఖ, లక్ష్మీ యోగాలు జరుగుతున్నాయి. 
 
ఇళ్లలో పూజ..
సాయంత్రం 5 గంటల నుంచి 6.30 వరకు
సాయంత్రం 5.37 గంటల నుంచి 7 గంటల వరకు
రాత్రి 7.15 గంటల నుంచి 8.45 వరకు శుభమూహుర్తాలు ఆయా సమయాల్లో ఎప్పుడైనా పూజాధి కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చు.
 
విద్యార్థులు..
సాయంత్రం 6.48 నిమిషాల నుంచి 8.48 నిమిషాల వరకు విద్యార్థులు పూజాధిక్యక్రమాలు నిర్వహిస్తే శుభ ఫలితాలు పొందుతారు.
 
వ్యాపారస్థులు..
రాత్రి 7.15 నిమిషాల నుంచి 8.45
రాత్రి 1.15 నుంచి తెల్లవారుజామున 3.27 నిమిషాల వరకు పూజ కార్యక్రమాలు నిర్వహించే శుభఫలితాలు.
 
రైతులకు..
సాయంత్రం 5.45 నిమిషాల నుంచి 7.15 నిమిషాల వరకు పూజాది కార్యక్రమాలు నిర్వహించే శుభఫలితాలు.