యూపీ పోలీసు నియామకాల్లో 20 శాతం ఆడపిల్లలకే!

సీఎం యోగి రక్షాబంధన్​ కానుక

Aug 17, 2024 - 15:35
 0
యూపీ పోలీసు నియామకాల్లో 20 శాతం ఆడపిల్లలకే!

లక్నో: యూపీలో రక్షాబంధన్​ కు ముందు ప్రభుత్వం యువతులకు తీపికబురంచింది. ఇక నుంచి పోలీసు శాఖలో యువతులకు 20 శాతం ఉద్యోగాలు ఇస్తామని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్​ ప్రకటించారు. 

శనివారం లక్నోఅంబేద్కర్​ నగర్​ లో జరిగిన ఓ కార్యక్రమంలో యోగి పాల్గొని ప్రసంగించారు. త్వరలోనే యూపీలో 60వేల పోలీసు ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించారు. ఇందులో 20 శాతం ఉద్యోగాలను కేవలం యువతులకే కేటాయిస్తానని ప్రకటించారు. పోలీసు ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికే ఉద్యోగం లభిస్తుందన్నారు. ఈ ఉద్యోగాలలో అవినీతికి తావులేదన్నారు. గతంలో యూపీ చీకటిలో ఉండేదని ప్రస్తుతం ఈ ప్రాంతాన్ని వెలుగులోకి తీసుకువస్తున్నామన్నారు. అభివృద్ధే అజెండాగా ముందుకు వెళుతున్నామని తెలిపారు. 

మాఫియాను కూకటివేళ్లతో సహా పెకిలించేందుకు పోలీసు ఉద్యోగాల్లో ఆడపిల్లల పాత్ర కీలకమని అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని సీఎం యోగి ప్రకటించారు.