అమర్ నాథ్ ను దర్శించుకున్న 4.65 లక్షల మంది
భక్తులు గతేడాది 4.59 లక్షలన్న ఆలయ ట్రస్టు
శ్రీనగర్: జమ్మూకశ్మీర్ లోని అమర్ నాథ్ యాత్రికుల సంఖ్య సోమవారం వరకు 4.65 లక్షలకు దాటిదని అమర్ నాథ్ క్షేత్ర ట్రస్ట్ వెల్లడించింది. మంగళవారం 33వ బ్యాచ్ జమ్మూ నుంచి బయలుదేరిందని స్పష్టం చేసింది. గతేడాది కంటే ఈ యేడాది అమర్ నాథ్ ను దర్శించుకున్న వారి సంఖ్యను అధిగమించిందని పేర్కొంది. గతేడాది దర్శించుకున్న వారి సంఖ్య 4.59 లక్షలని వెల్లడించింది.
జమ్మూలోని భగవతి నగర్ బేస్ క్యాంపు నుంచి కశ్మీర్ వ్యాలీకి 1477 మందితో ఓ బృందం బయలుదేరిందని తెలిపింది. తెల్లవారుజామున 3.30 గంటలకు 52 రక్షణ వాహనాల కాన్వాయ్ ఓ జమ్మూ బేస్ నుంచి బయలుదేరారని ఆలయ ట్రస్టు స్పష్టం చేసింది.
1142 మంది పురుషులు, 254 మంది మహిళలు, ముగ్గురు పిల్లలు సహా, 66 మంది సాధువులు, 12మంది సాధ్విలు ఉన్నారని ఆలయ ట్రస్టు అధికారులు తెలిపారు.