రాష్ట్రపతి ఓనం శుభాకాంక్షలు

Happy Onam President

Sep 14, 2024 - 20:25
 0
రాష్ట్రపతి ఓనం శుభాకాంక్షలు

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఓనం సందర్భంగా పౌరులకు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రపతి శనివారం తన సందేశంలో, కేరళ గొప్ప సాంస్కృతిక వారసత్వం, సంప్రదాయాలను జరుపుకోవడానికి ఓనం ఒక సందర్భమని అన్నారు. ఈ పండుగ పంటల కోతకు గుర్తుగా, కేరళ సాంస్కృతిక వారసత్వం, సంప్రదాయాలను జరుపుకునే సమయం అని రాష్ట్రపతి అన్నారు. దేశానికి ఆహారం అందించేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్న రైతులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. దేశ శక్తి సామర్థ్యాలను పెంచడంలోనూ, సామాజిక, ఆధ్యాత్మికతను పెంపొందించడంలో ఓనం పర్వదినం అత్యంత ముఖ్యమైన పండుగల్లో ఒకటన్నారు.