రుణమాఫీపై రైతుల ఆందోళన ఎమ్మెల్యే అనిల్ యాదవ్ మద్ధతు
Farmers' concern over loan waiver
నా తెలంగాణ, ఆదిలాబాద్: పార్టీలకు అతీతంగా రుణమాఫీ చేయాలని ఎటువంటి షరతులు లేకుండా రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని శనివారం ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండల కేంద్రంలోని రైతులు సీఎం దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ, రాజకీయానికి అతీతంగా రైతులకు రుణమాఫి చేస్తామని చెప్పి ఇప్పుడు మోసం చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి 15 రోజులలోగా అందరు రైతులకు రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు.
రైతులకు మద్ధతుగా ఎమ్మెల్యే బైఠాయింపు..
రైతులు జైనథ్ మండలంలోని రాస్తారోకో, జాతీయ రహదారిని దిబ్బంధం చేశారు. ఈ సమయంలో అక్కడి నుంచి వెళుతున్న బోథ్ ఎమ్మెల్యే అనిల్ యాదవ్ సైతం రైతులకు మద్దతుగా రాస్తారోకోలో పాలుపంచుకొని నిరసన వ్యక్తం చేశారు. రైతులు కోరుతున్న న్యాయమైన డిమాండ్లను నెరవేర్చే బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. వెంటనే రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. ఓ వైపు రైతుల పక్షపాతిగా చెప్పుకుంటున్న సీఎం రైతులను మరోసారి మోసం చేశారని ఇందుకు ఆయన వెంటనే రాజీనామా చేయాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు.