రక్షణ శాఖలో నాగాస్త్ర–1

సూసైడ్​ డ్రోన్​ 120 డ్రోన్​ లను అందించిన దేశీయ సంస్థ

Jun 14, 2024 - 20:19
 0
రక్షణ శాఖలో నాగాస్త్ర–1

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: రక్షణ శాఖ అమ్ముల పొదిలో ‘నాగాస్ర్త–1’ సూసైడ్​ డ్రోన్​ చేరింది. నాగ్​ పూర్​ కంపెనీ సోలార్ ఇండస్ట్రీస్‌కు చెందిన ఎకనామిక్స్ ఎక్స్‌ప్లోజివ్స్ లిమిటెడ్ యూనిట్ 120 డ్రోన్​ లను శుక్రవారం రక్షణ శాఖకు అందజేసింది. మొత్తం 480 డ్రోన్​ లను ఈ కంపెనీ రూపొందించాల్సి ఉండగా, తొలివిడతలో 120ని రూపొందించి రక్షణ శాఖకు అందించింది. ఈ డ్రోన్​ లు రెండు కిలోల పేలుడు పదార్థాలను మోసుకెళ్లగలవు. వీటిని పాక్​–చైనా సరిహద్దుల్లో మోహరించనున్నారు. 

నాగాస్ర్త–1 ప్రత్యేకతలు..

  • 1200 మీటర్లకు పైగా ఎగురగలదు. దీన్ని శాటిలైట్​ ద్వారా నియంత్రిస్తారు.
  • 30 కిలోమీటర్ల వరకు ఆటోమెటెడ్​ గా ప్రయాణిస్తుంది.
  • 15 కిలోమీటర్ల వరకు రిమోట్​ ద్వారా ఆపరేట్​ చేయవచ్చు.
  • 60 నిమిషాల వరకు గాలిలో ఎగరగలదు.
  • 2 కేజీల వార్​ హెడ్లను మోసుకెళుతుంది.
  • టార్గెట్​ ను చేధించలేకపోతే తిరిగి వచ్చేస్తుంది.