ప్రశాంత వాతావరణంలో నిమజ్జనం
జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి
నా తెలంగాణ, మెదక్: వినాయక నిమజ్జనం ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని మెదక్ జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి తెలిపారు. సోమవారం ఎస్పీ పోలీస్ ప్రధాన కార్యాలయం నుంచి నిమజ్జనాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. నిమజ్జన ప్రాంతాల్లో పటిష్ట చర్యలు చేపట్టామన్నారు. విద్యుత్ తీగలు లాంటివి విగ్రహాలకు తగిలే అవకాశం ఉన్నట్లు విగ్రహాల వద్ద ఉన్న పోలీసులకు తెలియజేస్తే వారు విద్యుత్ సిబ్బందికి తెలిపి వాటిని తొలగిస్తారన్నారు. నిమజ్జనం కోసం మంచి కండిషన్ లో ఉన్న వాహనాలనే ఉపయోగించాలన్నారు. మద్యం సేవించరాదని, డీజేలకు అనుమతి లేదన్నారు. చెరువులు, కుంటలు లాంటి ప్రాంతాల్లో నీళ్లలోకి దిగకూడదన్నారు. ఊరేగింపులో పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలని తెలిపారు. ఇప్పటికే ఉత్సవ కమిటీ సభ్యులు, శాంతి కమిటీ సభ్యులు, మండప నిర్వాహకులతో శాంతియుత నిమజ్జనానికి చర్యలు తీసుకున్నామని ఎస్పీ తెలిపారు. అత్యవసరం అయితే వందకు డయల్ చేయాలన్నారు. తప్పుడు ప్రచారాలను నమ్మవద్దన్నారు. బాణాసంచా, డీజేలకు అనుమతి లేదన్నారు. రెచ్చగొట్టే నినాదాలు చేయరాదన్నారు. భక్తిశ్రద్ధలతో నిమజ్జన కార్యక్రమాన్ని పూర్తి చేసుకోవాలని ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.