వక్ఫ్​ సవరణపై జేపీసీ నివేదిక సిద్ధం

JPC report on Waqf amendment prepared

Nov 21, 2024 - 19:40
 0
వక్ఫ్​ సవరణపై జేపీసీ నివేదిక సిద్ధం

పొడిగించాలని విపక్ష ఎంపీల డిమాండ్​
అధికార పక్ష ఎంపీల అభ్యంతరం
సోమవారం లోక్​ సభ స్పీకర్​ ను కలవనున్న విపక్ష ఎంపీలు

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: వక్ఫ్​ పై జేపీసీ నివేదిక సిద్ధమైంది. సవరణ బిల్లుకు సంబంధించి ఏర్పాటైన జాయింట్​ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) చివరి సమావేశం గురువారం జరిగింది. ఈ సందర్భంగా చివరి సారిగా సభ్యులందరూ చర్చను ముగించేందుకు తమ సూచనలు ఇవ్వాలని చైర్మన్​ జగదాంబిక పాల్​ విజ్ఞప్తి చేశారు. అయితే జేపీసీ సమయాన్ని మరింత పొడిగించాలని విపక్షలకు చెందిన ఎంపీలు సమావేశంలో డిమాండ్​ చేశారు. ఈ డిమాండ్​ పై అధికార పక్ష ఎంపీలు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ప్రతిపక్ష సభ్యులు సోమవారం లోక్​ సభ స్పీకర్​ ను కలవాలని నిర్ణయించారు. కమిటీని పొడిగించాలని లోక్​ సభ స్పీకర్​ కు విజ్ఞప్తిని చేయనున్నారు. వాస్తవానికి వక్ఫ్ చట్టంలో 40 సవరణల ప్రతిపాదనకు మంత్రివర్గ సమావేశంలో ఆమోదం లభించింది. పార్లమెంటులో సవరణ బిల్లు ఆమోదం పొందిన తర్వాత వక్ఫ్ బోర్డుకు ఉన్న అనియంత్రిత అధికారాలు తగ్గనున్నాయి. ధృవీకరణ లేకుండా ఏ ఆస్తిని బోర్డుకు ప్రకటించే అధికారం ఉండదు.