66 దేశాలు 135 పర్యటనలు మోదీ ఆల్​ టైమ్​ రికార్డ్​!

Modi's all-time record of 135 visits to 66 countries!

Jun 14, 2024 - 20:48
 0
66 దేశాలు 135 పర్యటనలు మోదీ ఆల్​ టైమ్​ రికార్డ్​!

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: ప్రధానిగా మోదీ పదేళ్లలో 66 దేశాలను సందర్శించారు. ఈ సందర్శనలోనూ మోదీ పలు రికార్డులు సృష్టించారు. 2014 నుంచి 2019 వరకు 57 దేశాల్లో 92 పర్యటనలు చేపట్టారు. 2019 నుంచి 2024 వరకు 28 దేశాల్లో 43 పర్యటనలు చేశారు. అత్యధికంగా 8సార్లు అమెరికాకు వెళ్లారు. 25 ఏళ్లలో ఏ ప్రధాని ఇన్ని దేశాల్లో తిరగలేదు. ఈ రికార్డు మోదీకే సొంతమైంది. రెండుసార్లు పదవీ కాలంలో 135 పర్యటనలు చేపట్టగా, 66 దేశాల్లో మోదీ పర్యటించారు. మన్మోహన్​ సింగ్​ పదేళ్ల పాలనలో 94 విదేశీ పర్యటనలు చేపట్టగా 43 దేశాలకు వెళ్లారు. అటల్​ బిహారీ వాజ్​ పాయ్​ రెండుసార్లు అధికారం చేపట్టగా 48 విదేశీ పర్యటనలు చేపట్టారు. ఈ పర్యటనలో 31 దేశాలను సందర్శించారు. 

2014 నుంచి 2019 వరకు పర్యటనలు..

మోదీ తొలిసారి ప్రధానిగా ఎంపికయ్యాక 2015, 2016, 2017, 2018, 2019లో చైనా పర్యటన ఐదుసార్లు చేపట్టారు. నేపాల్​ ఐదుసార్లు, బంగ్లాదేశ్​ రెండుసార్లు, మయాన్మార్​ రెండుసార్లు, భూటాన్​ మూడుసార్లు, శ్రీలంక మూడుసార్లు, మాల్దీవులు రెండుసార్లు, అప్ఘానిస్థాన్​ రెండుసార్లు, పాకిస్థాన్​ 2015లో ఒక్కసారి పర్యటన చేపట్టారు. అత్యధికంగా చైనాకు వెళ్లింది ప్రధాని మోదీయే కావడం విశేషం. అంతకుముందు నెహ్రూ, రాజీవ్​ గాంధీ, నరసింహారావు, వాజ్​ పాయ్​ లు ఒక్కసారి చైనాకు వెళ్లగా, మన్మోహన్​ సింగ్​ కేవలం రెండుసార్లే చైనాకు వెళ్లారు. అదే సమయంలో చైనా అధ్యక్షుడు షీ జిన్​ పింగ్​ మూడుసార్లు భారత పర్యటన చేపట్టారు. 2014, 2016, 2019ల్లో జిన్​ పింగ్​ భారత్​ కు వచ్చారు. మోదీ కార్యకాలంలో అమెరికాకు చెందిన అధ్యక్షులు మూడుసార్లు భారత్​ లో పర్యటించారు. వారిలో 2015 బారాక్​ ఒబామా, ఫిబ్రవరి 2020లో డోనాల్డ్​ ట్రంప్​, సెప్టెంబర్​ 2023న జో బైడెన్​ లు భారత్​ ను సందర్శించారు. 

తొలిసారిగా ఆయా దేశాలను సందర్శించిన రికార్డును కూడా మోదీ సొంతం చేసుకున్నారు. అంతకుముందు 40 యేళ్లుగా ఏ ప్రధాని ఈ దేశాల్లో పర్యటించకపోవడం విశేషం. ఇజ్రాయెల్​, ఫిలిప్పీన్స్​, రువాండా, బహ్రెయిన్​, పపువా న్యూ గినియా, మంగోలియాల పర్యటన చేపట్టారు. మోదీ రష్యాలో ఐదుసార్లు పర్యటించగా, పుతిన్​ భారత్​ లో నాలుగుసార్లు భారత్​ లో పర్యటించారు.