డాక్యుమెంట్జ్ డ్రీమర్స్ కు ముప్పు
అత్యధికులు భారతీయులే ఎంపీలకు వినతులు అధ్యక్షుడికి ఎంపీల విజ్ఞప్తులు జీ–7 సమావేశం తరువాత నిర్ణయం
వాషింగ్టన్: అమెరికాలో ఉన్న భారత డాక్యుమెంట్జ్ డ్రీమర్స్ (అమెరికాలో వీసా పొంది స్థిరపడ్డ వారి సంతానం)కు ముప్పు ఎదురవుతోంది. దీంతో వీరంతా తమ పర్మినెంట్ వీసా కోసం ఎంపీ సహాయం కోరుతున్నారు. వారి తల్లిదండ్రుల వీసాల ఆధారంగా నివసిస్తున్న 2.5 లక్షల మంది త్వరలో అమెరికా నిబంధనల ప్రకారం బహిష్కరణకు గురికానున్నారు. వీరిలో అత్యధికులు భారతీయులే ఉండడం ఆందోళన కలిగిస్తోంది. 21 సంవత్సరాలు పూర్తి అయితే వీరంతా అమెరికా నిబంధనల ప్రకారం వెళ్లిపోవాల్సి ఉంటుంది. ఇదే సమయంలో వీసా సమస్య పరిష్కారానికి 43 మంది ఎంపీలు జో బైడెన్ కు వినతులు పంపిస్తున్నారు. అయా తల్లిదండ్రులు తమ పిల్లల గ్రీన్ కార్డు కోసం దశాబ్దాలుగా ఎదురుచూస్తున్నారు.
తల్లిదండ్రుల వీసాతో చట్టపరంగానే వీరు ఉంటున్నప్పటికీ 21 యేళ్ల తరువాత ఆ హోదా వీరికి లభించదు. దీంతో వీరు తమ నివాస, ఉద్యోగ, ఉపాధిని వేరే దేశాల్లో, ప్రాంతాల్లో వెతుక్కోవాల్సి ఉంటుంది. అయితే జోబైడెన్ జీ–7 సమావేశం అనంతరం అమెరికా తిరిగి వచ్చాక వీసా నిబంధనలు, శాశ్వత ప్రాతిపదికన వీరికి వీసాలు, ఎంపీల అభ్యర్థనపై నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.
అమెరికా–భారత్ మధ్య సంబంధాలు బలోపేతంగానే ఉన్నా ఈ విషయంలో ఆ దేశం ఏం నిర్ణయం తీసుకోనుందనే ఆందోళన నెలకొంది.