పాక్​ లో రాజకీయ అస్థిరత

తగ్గించే ప్రయత్నంలో షరీఫ్​ విఫలం

Jun 14, 2024 - 19:19
 0
పాక్​ లో రాజకీయ అస్థిరత

ఇస్లామాబాద్​: ఓ వైపు ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న పాక్​ లో రాజకీయ అస్థిరతలు కూడా కొనసాగుతోంది. రాజకీయ అశాంతిని తగ్గించేందుకు ప్రధాని షెహబాజ్​ షరీఫ్​ ప్రయత్నాలను కొనసాగిస్తున్నా అవి ఫలించడం లేదు. శుక్రవారం మరోమారు ఆ దిశగా ప్రధాని షరీఫ్​ ప్రయత్నం చేయగా దానికి తిరస్కరణే ఎదురైంది. పీఎంఎల్​ ఎన్​ (పాకిస్థాన్​ ముస్లిం లీగ్​ నవాజ్​) లో జేయూఐ–ఎఫ్​ (జమియాత్ ఉలేమా-ఇ-ఇస్లాం) తమతో కలిసి రావాలని ప్రతిపాదించారు. కాగా ఈ ప్రతిపాదనను ఆ పార్టీ చీఫ్​ రెహ్మాన్​ ప్రభుత్వంలో చేరేందుకు నిరాకరించారు. 

ఈ సందర్భంగా మీడియాతో రెహ్మాన్​ మాట్లాడుతూ.. ప్రభుత్వం ఏర్పడక ముందునుంచే తమకు ఇలాంటి అవకాశాలు వచ్చాయన్నారు. తాము ప్రజాస్వామ్యానికి కట్టుబడి ఉన్నామని తెలిపారు. తాము ప్రభుత్వంలో చేరుతున్నామన్న మాట వాస్తవం కాదన్నారు.