ముంబై నార్త్ సెంట్రల్ నుంచి ఉజ్వల్ నికమ్
బీజేపీ తరపున 26/11 కేసు వాదించిన న్యాయవాది
ముంబై: ముంబై నార్త్ సెంట్రల్ నుంచి ఉగ్రవాది కసబ్ ను ఉరితీయడంలో కీలక భాగస్వామ్యం వహించిన న్యాయవాది ఉజ్వల్ నికమ్ ను బీజేపీ తమ అభ్యర్థిగా రంగంలోకి దించింది.
బీజేపీ శనివారం 15వ జాబితా విడుదల చేసింది. ఉజ్వల్ నికమ్ దేశంలోని అత్యంత ప్రసిద్ధ ప్రభుత్వ న్యాయవాదులలో ఒకరని, అతను ఉగ్రవాది అజ్మల్ కసబ్‌ను ఉరితీయడం, 1993 బాంబు పేలుళ్లు, గుల్షన్ కుమార్ హత్య కేసు, ప్రమోద్ మహాజన్ హత్య కేసు వంటి హై ప్రొఫైల్ కేసులలో ప్రభుత్వం తరపున ప్రాతినిధ్యం వహించారు. గేట్‌వే ఆఫ్ ఇండియా పేలుడు వంటి అనేక కేసులను నికమ్ వాదించారు. మహారాష్ట్రలోని జల్గావ్ నగరానికి చెందిన మరాఠా కుటుంబానికి చెందిన వారు నికమ్. ఐదో దశ కింద మే 20న ముంబైలో ఓటింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో బీజేపీ తమ అభ్యర్థిని ప్రకటించింది.