ఝార్ఖండ్​ బీజేపీ స్టార్​ క్యాంపెనర్ల జాబితా విడుదల

Jharkhand BJP star campaigners list released

Oct 25, 2024 - 17:56
 0
ఝార్ఖండ్​ బీజేపీ స్టార్​ క్యాంపెనర్ల జాబితా విడుదల

రాంచీ: ఝార్ఖండ్​ ఎన్నికలలో ప్రచారానికి స్టార్ క్యాంపెయినర్​ ల జాబితాను బీజేపీ రిలీజ్​ చేసింది. శుక్రవారం విడుదల చేసిన ఈ జాబితాలో 40 మంది స్టార్​ క్యాంపెనర్ల పేర్లను ప్రకటించింది. స్టార్​ ప్రచారక్తలలో తొలి పేరు ప్రధాని నరేంద్ర మోదీ, జేపీ నడ్డా, రాజ్​ నాథ్​ సింగ్​, అమిత్​ షా, నితిన్​ గడ్కరీ, శివరాజ్​ సింగ్​ ల పేర్లున్నాయి. రాష్ర్టం తరఫున చంపై సోరెన్​, అర్జున్​ ముండా, సీతా సోరెన్, హరియాణా సీఎం నయాబ్​ సింగ్​, అసోం సీఎం హిమంత బిస్వా శర్మ,  బాబులాల్​ మరాండీ తదితరుల పేర్లున్నాయి. ఝార్ఖండ్​ ఎన్నికల్లో బీజేపీ 81 స్థానాలకు గాను 68 స్థానాలలో పోటీ చేస్తుంది. ఇప్పటికే 66 మందితో తొలిజాబితాను బీజేపీ విడుదల చేసింది. సీఎం హేమంత్​ సోరెన్​ కోడలు సీతా సోరెన్​ కు జమ్తారా నుంచి బీజేపీ సీటును కేటాయించింది.