గూఢచర్యం ఆరోపణలు అమెరికా జర్నలిస్టు విచారణ
20యేళ్ల వరకు శిక్ష పడే అవకాశం జర్నలిజం, విషయాలు తెలుసుకోవడం నేరం కాదంటున్న అమెరికా అమెరికాతో ఒప్పందం కుదుర్చుకునే అవకాశం:పుతిన్
మాస్కో: గూఢచర్యం ఆరోపణలపై రష్యా జైలులో ఉన్న అమెరికన్ జర్నలిస్టును విచారించాలని నిర్ణయించింది. ఒకవేళ అదే నిజమైతే ఆ జర్నలిస్టుకు 20యేళ్ల వరకు శిక్ష పడే అవకాశం ఉంది. కాగా జర్నలిస్టు గెర్ష్ కోవిచ్ పై వచ్చిన ఆరోపణలు నిరాధారమైనవని అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి మాత్యూ మిల్లర్ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ తెలిపారు. రష్యా ప్రాసిక్యూటర్ జనరల్ కార్యాలయం గెర్ష్‌కోవిచ్‌ను అదుపులోకి తీసుకుంది. మరోవైపు సీఐఏ గెర్ష్ కోవిచ్ సూచనల మేరకు పనిచేస్తున్నట్లు గుర్తించినట్లు రష్యా ప్రకటించింది. జర్నలిజం, విషయాలు తెలుసుకోవడం నేరమేమీ కాదని అమెరికా వాదిస్తోంది. రష్యా చెబుతున్నవన్నీ అబద్ధాలేనని పేర్కొంటోంది. వెంటనే అతన్ని విడుదల చేయాలని డిమాండ్ చేస్తోంది. అయితే ఈ విషయంపై రష్యా అధ్యక్షుడు పుతిన్ మాట్లాడుతూ ఇతని విడుదలకు అమెరికాతో ఒప్పందం కుదుర్చుకునే అవకాశం ఉందన్నారు.