రైతులు సుప్రీంను ఆశ్రయించొచ్చు
Farmers can approach the Supreme Court
రైతు నాయకుడు చికిత్స పొందాలి
పంజాబ్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు సూచనలు
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: సమస్యల పరిష్కారం కోసం నిరసన చేస్తున్న రైతులు తమ వద్దకు రావచ్చని సుప్రీంకోర్టు తెలిపింది. రైతు నాయకుడు జగ్జిత్ సింగ్ దల్లేవాల్ ఆరోగ్యం ముఖ్యమని వెంటనే చికిత్స పొందాలని సుప్రీం చెప్పింది. బుధవారం హరియాణా పంజాబ్ లోని ఖనౌరీ సరిహద్దులో జగ్జిత్ సింగ్ రైతులతో చేపట్టిన నిరసనపై సుప్రీం స్పందించింది. డిమాండ్లు, సూచనలతో తమను సంప్రదించాలని పేర్కొంది. దల్లేవాల్ ఆరోగ్యంపై సుప్రీం పంజాబ్ ప్రభుత్వాన్ని సమాధానం కోరింది. సుప్రీం పేర్కొన్న ఉత్తర్వులే గాక తాము ముందు నుంచే రైతు నాయకుడు దల్లేవాల్ కు చికిత్సనందించాలని ప్రయత్నించామని రాష్ర్ట ప్రభుత్వం తెలిపింది. అయినా ఆయన నిరాకరించాడని పేర్కొంది. సుప్రీంకోర్టు కూడా ఉత్తర్వుల్లో దల్లేవాల్ ను ముందుకు ఆసుపత్రికి తరలించి చికిత్స అందించాలని చెప్పినట్లు పేర్కొన్నారు. 23 రో జులుగా జగ్జిత్ దల్లేవాల్ ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు. నిరాహార దీక్షపై అలసత్వం వద్దని పరిస్థితిని పంజాబ్ ప్రభుత్వం సమీక్షించాలని సుప్రీం ఆదేశించినట్లు ప్రభుత్వం పేర్కొంది. కాగా డిసెంబర్ 13న శంభు సరిహద్దు తెరిచేందుకు సుప్రీం నిరాకరించింది. నిరసనను వేరే ప్రదేశానికి మార్చాలని లేదా కొంతకాలం పాటు వాయిదా వేయాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.