నేటి బాలలే దేశ భవిష్యత్తుకు వెలుగులు

కేశంపేట జడ్పీటీసీ తాండ్ర విశాల శ్రవణ్ రెడ్డి

Jun 14, 2024 - 17:31
 0
నేటి బాలలే దేశ భవిష్యత్తుకు వెలుగులు

నా తెలంగాణ, షాద్ నగర్: నేటి బాలలే రేపటి పౌరులు, దేశ భవిష్యత్తుకు వెలుగులని, సర్కార్ బడిలో కూడా ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా నాణ్యమైన ఉపాధ్యాయులచే విద్యా బోధన సాగుతుందని కేశంపేట జడ్పీటీసీ తాండ్ర విశాల శ్రావణ్ రెడ్డి అన్నారు. శుక్రవారం కేశంపేట మండల పరిధిలోని పాపిరెడ్డి గూడ గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో బడిబాట కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన సామూహిక అక్షరాభ్యాసం కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఆమె పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఇంచార్జ్ ఎంపీడీవో మనోహర్, ఇంచార్జ్ ఎంపీడీఓ రవిచంద్రకుమార్ రెడ్డి, ఉపాధ్యాయులు, అంగన్​ వాడీ ఉపాధ్యాయులు, చిన్నారులు తదితరులు పాల్గొన్నారు.