నీట్ కౌన్సెలింగ్ త్వరలో ప్రారంభం
విద్యార్థులకు నష్టం జరగనీయం కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: నీట్ పరీక్ష కౌన్సెలింగ్ ప్రారంభం కానుందని, విద్యార్థులకు ఎలాంటి ఆందోళనలు అక్కరలేదని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. శుక్రవారం ఆయన ఎక్స్ సామాజిక మాధ్యమంగా విద్యార్థులకు ఈ విషయాన్ని వివరించారు. నీట్ లో అవతకతవకల అంశం సుప్రీంకోర్టు పరిధిలో ఉందన్నారు. కోర్టు పరిధిలో అంశం ఉన్నందున కోర్టు చెప్పినట్లు నడుచుకోవాలన్నారు. అదే సమయంలో విద్యార్థులకు ఎలాంటి నష్టం వాటిల్లనీయబోమని స్పష్టం చేశారు. ఏ విద్యార్థికి నష్టం జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు. విద్యార్థులు గందరగోళం లేకుండా కౌన్సెలింగ్ కు హాజరు కావాలని ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు.