బీజేపీ సభ్యత్వంతో అభివృద్ధికి బాసట 

పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అందెబాబయ్య

Sep 5, 2024 - 18:37
 0
బీజేపీ సభ్యత్వంతో అభివృద్ధికి బాసట 
నా తెలంగాణ, షాద్ నగర్: సనాతన ధర్మాన్ని సంరక్షించేందుకు, దేశాన్ని మరింత అభివృద్ధి చేసుకునేందుకు ప్రతి ఒక్కరూ బీజేపీ సభ్యత్వం తీసుకోవాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అందెబాబయ్య పిలుపునిచ్చారు. షాద్ నగర్ నియోజకవర్గం కేశంపేట మండలకేంద్రంలో బీజేపీ మండల అధ్యక్షుడు రొల్లు రఘురాం గౌడ్ ఆధ్వర్యంలో గురువారం మండల సభ్యత్వ నమోదు కార్యశాల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన అందెబాబయ్య మాట్లాడారు. 
 
రాబోయే కాలంలో భారతదేశాన్ని అత్యంత శక్తివంతమైన దేశాలలో ఒకటిగా మార్చాలన్న ప్రభుత్వ దార్శనికతను సాకారం చేయడంలో సహాయపడటానికి, యువత కొత్త ఆలోచనలు  సాకారం చేసుకోవడానికి బీజేపీ ప్రభుత్వానికి బాసటగా నిలవాలన్నారు. 
 
మండల అధ్యక్షుడు రొల్లు రఘురాం గౌడ్ మాట్లాడుతూ వికసిత్ భారత్ నినాదాన్ని కాంక్షించే ప్రతి ఒక్కరూ బీజేపీ సభ్యత్వం తీసుకొని అభివృద్ధిలో భాగస్వాములు కావాలని, మండలంలో శుక్రవారం నుంచి సభ్యత్వ కార్యక్రమం ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. 
 
ఈ కార్యక్రమంలో మండల సభ్యత్వ నమోదు కార్యశాల కన్వీనర్ మోటె శ్రీనివాస్, కో కన్వీనర్ కానం ఉదయ్​ గౌడ్, కో కన్వీనర్ కరెడ్ల నరేందర్ రెడ్డి, జిల్లా పదాధికారులు, మండల పదాధికారులు, శక్తి కేంద్ర ఇన్చార్జులు, మోర్చా సభ్యులు, బూత్ అధ్యక్షులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.