తెలంగాణలో భవిష్యత్తు బీజేపీదే
మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ ఎంపీని కలిసిన షాద్ నగర్ బీజేపీ నాయకులు
నా తెలంగాణ, షాద్ నగర్: తెలంగాణలో భవిష్యత్తు బీజేపీదేనని, నాయకులు, కార్యకర్తలు పార్టీ బలోపేతానికి కృషి చేయాలని మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ సూచించారు. బుధవారం బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నెల్లి శ్రీవర్ధన్ రెడ్డి, అందె బాబయ్యల ఆధ్వర్యంలో షాద్ నగర్ బీజేపీ నాయకులు పార్లమెంట్ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన డీకే అరుణమ్మను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా నెల్లి శ్రీవర్ధన్ రెడ్డి, అందె బాబయ్యలు మాట్లాడుతూ ముఖ్యమంత్రి సొంత జిల్లాలో బీజేపీ ఘనవిజయం సాధించిందంటే కార్యకర్తలు నాయకుల సమిష్టి కృషి వల్లనే సాధ్యమైందన్నారు. రామరాజ్యం కోసం పాలమూరు ప్రజలు డీకే అరుణమ్మకు అండగా ఉన్నారన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు దేపల్లి అశోక్ గౌడ్, అముడాపురం నర్సింహా, వంశీ కృష్ణ, ప్యాట అశోక్, మోటె శ్రీనివాస్, రొల్లు రఘురాం గౌడ్, చెట్ల వెంకటేష్ మల్చలం మురళి, హరీభూషణ్ పటేల్, శ్రీనివాస్ చారి, పుట్నాల సాయి కుమార్, హరీష్, పల్లె హన్మంత్, శ్రీకాంత్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.