మంత్రిగా బండి సంజయ్ బాధ్యతల స్వీకరణ
Bandi Sanjay accepts responsibilities as minister

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా బండి సంజయ్ గురువారం బాధ్యతలను చేపట్టారు. ఢిల్లీలోని నార్త్ బ్లాక్ కేంద్ర హోంశాఖ కార్యాలయంలో బాధ్యతలను స్వీకరించారు. జగద్గురు శంకరాచార్య హంపి విరూపాక్ష విద్యారణ్య భారతి స్వామి ఆశీస్సులను తీసుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించి మంత్రి బాధ్యతలను తీసుకున్నారు.