స్పెయిన్ లో అగ్నిప్రమాదం 10మంది మృతి
10 people died in a fire in Spain
మాడ్రిడ్: స్పెయిన్‌లోని జరాగోజాలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. శుక్రవారం ఓ నర్సింగ్‌హోమ్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో 10 మంది మరణించారని స్థానిక అధికారులు మీడియాకు తెలిపారు. ఈశాన్య నగరమైన మాడ్రిడ్‌కు ఉత్తరాన 30 నిమిషాల దూరంలో ఉన్న విల్లా ఫ్రాంకా డి ఎబ్రో నర్సింగ్ హోమ్‌లో అగ్నిప్రమాదం సంభవించిందన్నారు. వెంటనే అప్రమత్తమై అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారని తెలిపారు. 82మందికి తీవ్ర గాయాలయ్యాయని తెలిపారు. వీరందరినీ స్థానికంగా ఉన్న ఆసుపత్రిలో చేర్చి చికిత్సనందిస్తున్నట్లు తెలిపారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందన్నారు. ప్రమాదంపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.