త్రిశూలిలో ఎన్డీఆర్​ఎఫ్​ సెర్చ్​

ఆపరేషన్​ నేపాల్​ విజ్ఞప్తి మేరకు భారత బృందం

Jul 21, 2024 - 20:36
 0
త్రిశూలిలో ఎన్డీఆర్​ఎఫ్​ సెర్చ్​

ఖాట్మాండు: నేపాల్​ త్రిశూలి నదిలో కొట్టుకుపోయిన వారి ఆచూకీ కనుగొనేందుకు నేపాల్​ ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు భారత బృందం శనివారం చేరుకుంది. ఆదివారం ఉదయాన్నే ఈ 12 మంది ఎన్డీఆర్​ఎఫ్​ బృందం అత్యాధునిక పరికరాలతో సెర్చింగ్​ ఆపరేషన్​ కు దిగింది. సోనార్​ కెమెరాలతో ఎన్డీఆర్​ ఎఫ్​ బృందాలు బోట్ల ద్వారా త్రిశూలి నదిలో సెర్చింగ్​ ఆపరేషన్​ మొదలు పెట్టారు. నలుగురు గజ ఈతగాళ్లు (డైవర్స్​) కూడా సెర్చ్​ ఆపరేషన్​ లో పాల్గొన్నారు. 
గత వారం 65 మందితో ప్రయాణిస్తున్న రెండు బస్సులు అదుపు తప్పి త్రిశూలి నదిలో పడిపోయాయి. ఈ ప్రమాదంలో  పలువురిని రెస్క్యూ బృందాలు రక్షించాయి. ముగ్గురు నదిని ఈదుకుంటూ ప్రాణాలు దక్కించుకోగలిగారు. మిగతా వారి ఆచూకీ ఇంకా లభించలేదు. ఇందులో ఏడుగురు భారతీయులు కూడా ఉన్నారు.