కాంగ్రెస్ పరాజయం ఖయం
నిరాశ, నిస్పృహల్లో నాయకులు కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షా
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడం ఖాయమని ముందే తెలిసిపోయిందని అందుకే ఎగ్జిట్ పోల్స్ లో తాము పాల్గొనబోమని పార్టీ నిర్ణయించిందిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా విమర్శించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ దేశ తిరస్కరణ ధోరణిని ప్రజలు చాలాకాలంగా గమనిస్తున్నారని ఆరోపించారు. మెజార్టీ ఖాయమని ఊకదంపుడు ఉపన్యాసాలే తప్ప అంతర్గతంగా ఆ పార్టీకి ఓటమి ఖాయమని బడా నేతు నీరసపడుతున్నారని షా తెలిపారు. ఆ బడా నాయకులు ఎగ్జిట్ పోల్ లో పాల్గొంటే తమ పరువు పూర్తిగా పోవడం ఖాయమని టీవీల ముందుకు వచ్చేందుకు నిరాకరించాలని నిర్ణయించినట్లు షా పేర్కొన్నారు. అందుకే ఎగ్జిట్ పోల్ లో తాము పాల్గొనబోమని కాంగ్రెస్ పార్టీ చెబుతోందని తెలిపారు.
ఎగ్జిట్ పోల్స్ నుంచి కాంగ్రెస్ పారిపోవద్దని ఓటమిని జీర్ణించుకొని ఆత్మపరిశీలన చేసుకోవాలని తాను సూచిస్తున్నట్లు షా తెలిపారు.
కాంగ్రెస్ అధికార ప్రతినిధి పవన్ ఖేడా ఎగ్జిట్ పోల్ లో పాల్గొనేద లేదని ఇటీవల ప్రకటించారు. ఈ వ్యాఖ్యలపై అమిత్ షా కౌంటరిచ్చారు.