కువైట్​ అగ్నిప్రమాదం మృతుల సంఖ్య 49

ధృవీకరించని అధికారులు

Jun 12, 2024 - 21:38
 0
కువైట్​ అగ్నిప్రమాదం మృతుల సంఖ్య 49

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: కువైట్​ మంగాఫ్​ లో  బుధవారం జరిగిన అగ్నిప్రమాదంలో మృతుల సంఖ్య 49కి చేరింది. గంటగంటకు మృతుల సంఖ్యలో పెరుగుదల నమోదవుతుండడంతో తీవ్ర ఆందోళన వ్యక్తం అవుతోంది. మృతుల్లో 40 మంది వరకు భారతీయులున్నట్లు తెలుస్తోంది. అయితే ఎంతమంది మృతిచెందారన్న విషయాన్ని అధికార వర్గాలు ఖచ్చితంగా ధృవీకరించడం లేదు. అగ్నిప్రమాదంలో 50 మందికి పైగా గాయపడినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.