పేపర్​ లీక్​ బిల్లుకు బిహార్ అసెంబ్లీ​ ఆమోదం

10ఏళ్ల జైలు, రూ. 1 కోటి జరిమానా!

Jul 24, 2024 - 18:11
 0
పేపర్​ లీక్​ బిల్లుకు బిహార్ అసెంబ్లీ​ ఆమోదం

పాట్నా: పేపర్​ లీక్​ కు పాల్పడితే పదేళ్ల జైళ్లు, కోటి రూపాయల వరకు జరిమానా విధించే బిల్లుకు బుధవారం బిహార్​ అసెంబ్లీ ఆమోదించింది. గవర్నర్​ సంతకం తర్వాత పూర్తి స్థాయిలో ఈ బిల్లు అమల్లోకి రానుంది. పేపర్​ లీక్​ ను తీవ్రమైన నేరంగా పరిగణించనున్నారు. కొత్త చట్టం ప్రకారం 3 యేళ్ల నుంచి 10ఏళ్లు జైలు శిక్ష, రూ. 10 లక్షల నుంచి రూ. 1 కోటి వరకు జరిమానా విధించనున్నారు. అన్ని పరీక్షలకు సంబంధించిన పేపర్​ లీక్​ లకు ఈ చట్టం వర్తించనుంది. అదే సమయంలో పేపర్​ లీక్​ లో ఏదైనా సంస్థ హస్తం ఉన్నట్లు తేలితే దాన్ని నాలుగేళ్లపాటు బ్లాక్​ లిస్ట్​ లో పెట్టనున్నారు.